కట్టుకున్న భార్యపై అసహజ లైంగిక దాడి.. భర్తకు 5 ఏళ్ల జైలు శిక్ష

by Malleboina Mahesh |

భార్యపై అసహజ లైంగిక దాడికి పాల్పడిన భర్తకు 5 ఏళ్ల జైలు శిక్ష.. హైదరాబాద్ 5వ అదనపు సెషన్స్ కోర్టు కీలక తీర్పు!

కట్టుకున్న భార్యపై అసహజ లైంగిక దాడి.. భర్తకు 5 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: కట్టుకున్న భార్యపై భర్త అసహజ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా తీవ్ర శారీరక వేధింపులకు పాల్పడిన కేసులో భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష (5 Years Imprisonment) పడింది. ఈ సంచలన తీర్పును హైదరాబాద్‌లోని ఐదో అదనపు సెషన్స్ కోర్టు ఇచ్చింది. సమాజంలో మనుషుల సంబంధాల నైతికతను ప్రశ్నించేలా ప్రవర్తించిన సదరు నిందితుడిపై మోపబడిన నేరాలు కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది.

6 ఏళ్ల తర్వాత బాధితురాలికి దక్కిన న్యాయం..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పరిధిలోని సాయిగూడ ప్రాంతానికి చెందిన రామ్ బిరాదర్ అనే వ్యక్తి, తన భార్యను నిరంతరం అసహజ లైంగిక దాడికి గురిచేస్తూ, తీవ్రంగా వేధించేవాడు. భర్త పెడుతున్న నరకాన్ని భరించలేకపోయిన బాధితురాలు.. 2018 సెప్టెంబరులో పోలీసులకు న్యాయం చేయాలంటూ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి, కోర్టులో పక్కాగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుదీర్ఘంగా సాగిన న్యాయ విచారణ అనంతరం, భార్య పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించిన భర్త రామ్ బిరాదర్ దోషిగా తేలడంతో న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Next Story