క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసు.. సీఐ నాగరాజు పై ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ’ కేసు నమోదు

by Malleboina Mahesh |

క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో సెల్ఫీ వీడియో ఆధారంగా సస్పెండెడ్ సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసు.. సీఐ నాగరాజు పై ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ’ కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతంలో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) నాగరాజుకు మరో షాక్ తగిలింది. అతనిపై పోలీసులు చట్టాన్ని మరింత పకడ్బందీగా ప్రయోగిస్తున్నారు. ఈ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా సస్పెండెడ్ సీఐ నాగరాజు పై పోలీసులు తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC/ST Atrocities Act) కేసుతో పాటు మరికొన్ని కొత్త సెక్షన్లను జోడించి కేసు నమోదు చేశారు.

సెల్ఫీ వీడియో ఆధారంగా కొత్త సెక్షన్లు..

పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రికార్డ్ చేసిన ‘సెల్ఫీ వీడియో’ (Selfie Video) ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. తన చావుకు సీఐ నాగరాజు పూర్తి కారణమని, ఆయన పెట్టిన టార్చర్ భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని క్రాంతి కుమార్ ఆ వీడియోలో స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ పక్కా ఆధారాల పరిశీలన అనంతరం, దర్యాప్తు అధికారులు కేసు తీవ్రతను బట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేసులో చేర్చారు. అలాగే ఈ ఘోరానికి సంబంధించిన మరిన్ని సాంకేతిక ఆధారాలు, డిలీట్ చేసిన డేటాను సేకరించడం కోసం క్రాంతికుమార్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు ఉన్నత స్థాయి ల్యాబొరేటరీ అయిన ‘ఫోరెన్సిక్ సైన్స్ లాబ్’ (FSL) కు పంపించారు. నిందితుడైన సస్పెండెడ్ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story