చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న అధికారిపై దాడికి యత్నం

by Kodari Anjali |

జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిని అడ్డుకున్న ఇరిగేషన్ శాఖ అధికారిపై దాడి చేశారు.

చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న అధికారిపై దాడికి యత్నం
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామ చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిని అడ్డుకున్న ఇరిగేషన్ శాఖ అధికారిపై మట్టి మాఫియాకు చెందిన వ్యక్తి దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆందోళన కలిగించింది. చెరువులో అక్రమంగా మట్టి తీస్తున్నారనే సమాచారం అందడంతో ఇరిగేషన్ లస్కర్ సంజీవ్ సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ మట్టి తవ్వుతున్న వ్యక్తులను చూసి "అక్రమంగా మట్టి తవ్వకాలు ఎందుకు చేస్తున్నారు? వెంటనే ఆపండి" అని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన అక్రమ మట్టి మాఫియాకు చెందిన వ్యక్తి ప్రభుత్వ అధికారి సంజీవ్‌పైకి దూసుకెళ్లాడు. కాలితో తన్ని, నానా బూతులు తిడుతూ, చెప్పుతో కొట్టేందుకు యత్నించాడు. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్థానికులు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. చెరువులను పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారితో పాటు వారికి సహకరిస్తున్న వారిపైనా చర్యలు ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story