క్రికెటర్ పృథ్వీ షాతో బ్రేకప్‌.. పోస్ట్‌తో అసలు నిజాలు బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్

by Mallepaka Hamsa |

ఆకృతి తన ప్రియుడు పృథ్వీషాతో బ్రేకప్‌పై మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. తన కాబోయే భర్తతో విభేదాలు తలెత్తి బ్రేకప్ అయినట్లు వస్తున్న వార్తలను ఆకృతి ఖండించారు.

క్రికెటర్ పృథ్వీ షాతో బ్రేకప్‌.. పోస్ట్‌తో అసలు నిజాలు బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్
X

దిశ, సినిమా: ‘త్రిముఖ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన ఆకృతి అగర్వాల్ తన నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సన్నీలియోన్, సుమన్, రాజేంద్రన్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించినంత స్థాయిలో రాణించకపోయినప్పటికీ ఆకృతికి మాత్రం క్రేజ్ బాగానే వచ్చింది. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో తన అదష్టాన్ని పరీక్షించుకొంటున్న ఆకృతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయానికొస్తే.. ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఈ అమ్మడు క్రికెటర్ పృథ్వీషాతో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. వారి ప్రేమ వ్యవహారం కాస్త పీక్స్‌కు చేరడంతో వారిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. మార్చి నెలలో ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్‌మెంట్ కూడా ఘనంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలు జరిగిన నాలుగు నెలలకే.. ఈ జంట మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఆకృతి పెట్టిన ఓ పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఉండటం గమనార్హం.

తాను చాలాసార్లు చీటింగ్‌కు గురయ్యానని.. కానీ ఏ రోజు కూడా ఒక్క మాట కూడా బయటకు చెప్పలేదని తెలిపారు. అయితే జీవితంలో ఓ అడుగు ముందుకు వేసుందుకు నిర్ణమం తీసుకొన్న తర్వాత.. కొన్ని విషయాలను నమ్మలేకపోతున్నాను అని తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండి ప్రతీ విషయం నిజమే.. ప్రతీ రూమర్‌లో వాస్తవం ఉంది అని రాయడంతో.. క్రికెటర్ పృథ్వీషానే తనను మోసం చేశాడని.. అందుకే వీరిద్దరు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తాజాగా, ఆకృతి తన ప్రియుడు పృథ్వీషాతో బ్రేకప్‌పై మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. తన కాబోయే భర్తతో విభేదాలు తలెత్తి బ్రేకప్ అయినట్లు వస్తున్న వార్తలను ఆకృతి ఖండించారు. తన పోస్ట్ క్లోజ్‌ఫ్రెండ్స్‌ను ఉద్దేశించి పెట్టినది మాత్రమే అని వెల్లడించారు. అంతేకాకుండా ఒక చిన్న పొరపాటు వల్ల తన ప్రేమికుడు పృథ్వీషా పరువును కోల్పోయే పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉందని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో ఆకృతి-పృథ్వీషా బ్రేకప్ పుకార్లకు చెక్ పడినట్లు అయింది.

Next Story