- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని దర్శించుకున్న గవర్నర్ సతీమణి
by Taduka Kalyani |
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సతీమణి జానకి శుక్లా మంగళవారం ఉదయం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్‌లో కొలువై ఉన్న ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’నీ సందర్శించారు.

X
దిశ, శంషాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సతీమణి జానకి శుక్లా మంగళవారం ఉదయం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్‌లో కొలువై ఉన్న ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’నీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని 108 దివ్య దేశాలను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికి, రామానుజాచార్యుల విశిష్టతను, ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో ఆమె శ్రీ రామానుజాచార్యుల బోధనల పట్ల ఆసక్తిని కనబరిచారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.
Next Story






