- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పడమటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురం పనుల ప్రారంభంలో ఆలస్యం.. మంత్రి ఆగ్రహం
అతి పురాతనమైన మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురం పనుల ప్రారంభంలో ఆలస్యం కావడంపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దిశ, మక్తల్: అతి పురాతనమైన మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురం పనుల ప్రారంభంలో ఆలస్యం కావడంపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రి వాకిటి శ్రీహరి పడమటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు ఎందుకు మొదలుపెట్టలేదని ఎండోమెంట్ ఇంజనీర్లను, కాంట్రాక్టర్‌ను ఆయన నిలదీశారు. రానున్న డిసెంబర్‌లో జరిగే పడమటి అంజన్న ఉత్సవాల నాటికి రాజగోపురం నిర్మాణం కచ్చితంగా పూర్తి కావాలని అన్నారు.
"పడమటి అంజన్న ఎంతో మహిమగల దేవుడు. భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ఈ ప్రాంతంలోనే కాకుండా, మా కుటుంబానికి కూడా ఆరాధ్య దైవం. స్వామి వారి ఆలయానికి 14 ఫీట్ల వెడల్పు, మూడంతస్తుల ఎత్తుతో ఎంతో విశాలమైన, సుందరమైన రాజగోపురాన్ని నిర్మించాలని సంకల్పించాం. ఇందుకోసం నా సొంత నిధుల నుండి దాదాపు రూ. 60 లక్షలు కేటాయించి, అన్ని రకాల పరిపాలనా అనుమతులు మంజూరు చేయించాను" అని మంత్రి తెలిపారు
వారం రోజుల క్రితమే రాజగోపుర నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటికీ.. ఎండోమెంట్ ఇంజనీర్లు మార్కౌట్ ఇవ్వకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం క్షమించరాని విషయమని మంత్రి మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో, ఆలయ అర్చకులు, సిబ్బందితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






