తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

by Ajay Maddhiboyina |

మ‌రో 2,3 రోజుల్లో దేశ‌మంత‌టా నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రిస్తాయని వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 50 నుండి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని పేర్కొంది.

తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: మ‌రో 2,3 రోజుల్లో దేశ‌మంత‌టా నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రిస్తాయని వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 50 నుండి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని పేర్కొంది. ఈ నెల 10 వ‌ర‌కు వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. ఇక ఈరోజు కూడా రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నాగ‌ర్ క‌ర్నూల్, వన‌ప‌ర్తి, న‌ల్గొండ‌, యాదాద్రి, సిద్దిపేట్, క‌రీంన‌గ‌ర్, హ‌న్మ‌కొండ జిల్లాల్లో వ‌ర్షాలు తేలిక‌పాటి వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. హైద‌రాబాద్ లోనూ ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసే అవకాశం ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

Next Story