- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. తొమ్మిది మంది పోలీసులు మృతి
by velandi.Saikiran |
పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి జరుగగా తొమ్మిది మంది పోలీసులు మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ దేశంలో రోజుకో ఉగ్రదాడి జరుగుతోంది. దీంతో అక్కడి సాధారణ ప్రజలు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో చెక్ పోస్ట్ పై దాడి జరిగింది. ఈ సంఘటనలో ఏకంగా తొమ్మిది మంది పోలీసులు మృతి చెందారు.
చాలా మంది అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 8 మంది పోలీసులను కిడ్నాప్ చేశారట ముష్కరులు. అయితే వారిని భద్రత దళాలు చాలా చాకచక్యంతో కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఇది బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల జవాన్లపై ఆత్మహత్య దాడి కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన సంగతి తెలిసిందే.
Next Story






