- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ టీచర్, ఆయాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ టీచర్ల, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీడీపిఓ హేమ భార్గవి వెల్లడించారు.

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ టీచర్ల, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీడీపిఓ హేమ భార్గవి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మెదక్ జిల్లా ఆదేశాల మేరకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నర్సాపూర్ పరిధిలో ఉన్న 23 అంగన్వాడీ టీచర్లకు (అన్ని ప్రాంతాలలో) మరియు 56 అంగన్వాడి ఆయాల(గిరిజన ప్రాంతాలలో మాత్రమే) భర్తీకి అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అర్హతలు ఇతర నియమ నిబంధనల కొరకు http://wdcw.tg.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీ ఈనెల 10 నుండి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ప్రజావాణిలో గాని, కార్యాలయంలో గాని దరఖాస్తులను సమర్పిస్తే దరఖాస్తులను పరిగణలోనికి తీసుకోబడవని వెల్లడించారు. పూర్తి వివరాలకు నర్సాపూర్ ఐసిడిఎస్ సీడీపిఓ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.






