సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం

by Taduka Kalyani |

టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్, హైదరాబాద్ లో సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత కల్గిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు లను కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ కే హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.

సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్, హైదరాబాద్ లో సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత కల్గిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు లను కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ కే హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ఎస్సీ , బీసీ, ఎస్టీ అభ్యర్థులు జూలై 12 లోగా tsstudycircle.co.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.3 లక్షలు లోపు ఆదాయం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 19 న ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నారు. ఈ పరీక్ష లో ఎంపికైన మెరిట్ విద్యార్థులకు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం కలెక్టరేట్ లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు.

Next Story