- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజారోగ్యం, తాగునీటి పై మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఫోకస్
బాన్సువాడ పట్టణంలో ప్రజారోగ్యం, తాగునీటి పై కమిషనర్ ఫోకస్ హోటళ్ళ పై ఆకస్మిక తనిఖీలు, మంజీరా జలాల పొదుపు పై కౌన్సిలర్లతో చర్చించారు.

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో ప్రజారోగ్యం, తాగునీటి పై కమిషనర్ ఫోకస్ హోటళ్ళ పై ఆకస్మిక తనిఖీలు, మంజీరా జలాల పొదుపు పై కౌన్సిలర్లతో చర్చించారు. వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో ప్రజారోగ్య పరిరక్షణ, తాగునీటి సరఫరా పై బాన్సువాడ పురపాలక సంఘం కమిషనర్ గోపు గంగాధర్ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజులుగా వరుసగా హోటళ్ళ తనిఖీలు, మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించి అధికారులు, కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు. హోటళ్ళలో పాత సరుకులు, అపరిశుభ్రత పై కొరడా ఝళిపించారు. కమిషనర్ గోపు గంగాధర్ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార నిల్వలు, వినియోగిస్తున్న సరుకులు, వంటశాలల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో చాలా రోజులుగా నిల్వ ఉన్న పాత సరుకులు ఉన్నట్లు గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. శుభ్రత ప్రమాణాలు పాటించని 2 హోటళ్ళకు జరిమానా విధించారు.
రాబోయే రోజుల్లో ప్రతిరోజూ తనిఖీలు ఉంటాయి. ఆహార నాణ్యత, శుభ్రతలో రాజీపడేది లేదు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు అని కమిషనర్ హెచ్చరించారు. తాగునీటి సమస్యల పై మున్సిపల్ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మిషన్ భగీరథ నీటి పంపిణీ ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీని పై చర్చించిన కౌన్సిలర్లు, ప్రస్తుతం ఉన్న మంజీరా జలాలను పొదుపుగా వినియోగించి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని సూచించారు. కౌన్సిలర్ల సూచనలకు స్పందించిన కమీషనర్ గంగాధర్, పెండింగ్‌లో ఉన్న పైప్‌లైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అన్ని కాలనీలకు సక్రమంగా నీరందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పరిశుభ్రత, తాగునీటి సరఫరా రెండింటిపైనా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రేష్మా బేగం ఏజాస్, కౌన్సిలర్లు నందకిశోర్, కాలేక్, హకీం, రుక్మిణి, అంజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.






