Swiggy: పూర్తి భారతీయ కంపెనీగా స్విగ్గీ

by S Gopi |

ఈ హోదా కోసం మే నెలలో జరిగిన వాటాదారుల ఓటింగ్‌లో 'ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్' సవరణకు 75 శాతం మేజారిటీ అవసరం కాగా, కేవలం 72.36 శాతం మద్దతు మాత్రమే లభించడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది.

Swiggy: పూర్తి భారతీయ కంపెనీగా స్విగ్గీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సరికొత్త మైలురాయిని అందుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన నివేదిక ప్రకారం, జూలై 6 నాటికి స్విగ్గీలో విదేశీ పెట్టుబడులు 49.76 శాతానికి తగ్గగా, దేశీయ ఇన్వెస్టర్ల వాటా 50.24 శాతానికి పెరిగింది. దీంతో స్విగ్గీ అధికారికంగా 'భారతీయ యాజమాన్య సంస్థ'గా అవతరించింది. అయితే, కంపెనీ ఆశిస్తున్న పూర్తి స్థాయి 'భారతీయ యాజమాన్యం, నియంత్రణలో ఉన్న సంస్థ' (ఐఓసీసీ) హోదాను సాధించడానికి మాత్రం ఇంకా ఒక అడుగు దూరంలో నిలిచింది. ఈ హోదా కోసం మే నెలలో జరిగిన వాటాదారుల ఓటింగ్‌లో 'ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్' సవరణకు 75 శాతం మేజారిటీ అవసరం కాగా, కేవలం 72.36 శాతం మద్దతు మాత్రమే లభించడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. ప్రస్తుత వాటాల మార్పు వల్ల కంపెనీ నిర్వహణ, వ్యాపార కార్యకలాపాలు లేదా బోర్డు ఓటింగ్ హక్కులలో ఎలాంటి తక్షణ మార్పులు ఉండబోవని స్విగ్గీ స్పష్టం చేసింది. స్విగ్గీకి ఐఓసీసీ హోదా వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. అది లభిస్తే కంపెనీ తన ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ వ్యాపారంలో నేరుగా సరుకు నిల్వలను (ఇన్వెంటరీ) కలిగి ఉండే అవకాశం పొందుతుంది. దీంతో కొనుగోలు, గిడ్డంగుల నిర్వహణ, సరఫరా గొలుసుపై మెరుగైన నియంత్రణతో పాటు వ్యాపార లాభదాయకత కూడా పెరిగే అవకాశం ఉంది.

Next Story