- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా వరల్డ్ కప్ నుంచి రొనాల్డో అవుట్.. మహమ్మద్ సిరాజ్ భావోద్వేగ పోస్ట్
ఫిఫా ప్రపంచకప్ 2026 నుంచి పోర్చుగల్ నిష్క్రమించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026)లో భాగంగా స్పెయిన్ (Spain) చేతిలో 1–0 తేడాతో పోర్చుగల్ (Portugal) ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలోనే ఆ జట్టు స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రపంచకప్ ప్రయాణానికి కన్నీటితో ఎండ్ కార్డ్ పడింది. తన కెరీర్‌లో ఇదే ఆఖరి వరల్డ్ కప్ అని రొనాల్డో ముందే ప్రకటించడంతో, అతడి నిష్క్రమణపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. రొనాల్డోకు ఉన్న వీరాభిమానుల్లో ఒకరైన టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఈ రోజు మ్యాచ్‌లో ఏం జరిగినా సరే.. నువ్వు ఎప్పటికీ నా రోల్ మోడల్, నా ఇన్‌స్పిరేషన్ క్రిస్టియానో. ఒక్క మ్యాచ్ నీ గొప్పతనాన్ని ఎప్పటికీ తగ్గించలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో స్ఫూర్తి నింపినందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు.
రొనాల్డోపై సిరాజ్‌కు ఉన్న అభిమానం..
మహ్మద్ సిరాజ్ మైదానంలో వికెట్ తీసిన ప్రతిసారీ క్రిస్టియానో రొనాల్డోకు చెందిన ఐకానిక్ ‘Siuuu’ సెలబ్రేషన్‌ను అనుకరిస్తూ గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. రొనాల్డో క్రమశిక్షణ, ఫిట్‌నెస్ ఆటపై ఉన్న ఇంట్రెస్ట్ తనను క్రికెట్‌లో రాణించడానికి దోహదపడ్డాయని గతంలో మహమ్మద్ సిరాజ్ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.






