- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata Power: అణు విద్యుత్ రంగంలో టాటా పవర్ ఎంట్రీకి సన్నాహాలు
ఈ దిశగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరమని ఆయన చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా పవర్ తన వ్యాపార విస్తరణలో మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ స్మాల్ మాడ్యులర్ అణు రియాక్టర్లు సహా అణు విద్యుత్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మంగళవారం ప్రకటనలో వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరమని ఆయన చెప్పారు. అనుమతుల ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, అణు విద్యుత్‌ను కంపెనీ భవిష్యత్తు వృద్ధిలో కీలక రంగంగా చూస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సోలార్, విండ్, హైడ్రో, బ్యాటరీ స్టోరేజ్ రంగాల్లో బలమైన ఉనికిని ఏర్పరుచుకున్న టాటా పవర్, ఇప్పుడు అణు విద్యుత్‌ను కూడా తన గ్రీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోలో చేర్చాలని భావిస్తోంది. అణు విద్యుత్ ప్రణాళికతో పాటు టాటా పవర్ 2030 నాటికి 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, రూ. లక్ష కోట్ల ఆదాయం, రూ. 10,000 కోట్ల నికర లాభం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 2029-30 వరకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఒడిశాలో 10 గిగావాట్ల సోలార్ తయారీ ప్రాజెక్ట్, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్), ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ వంటి ప్రాజెక్టులను కూడా కంపెనీ వేగంగా ముందుకు తీసుకెళ్తోందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.






