- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ENG vs IND : భారత్ ఘోర ఓటమి
ఇంగ్లండ్ తో జరిగిన మూడవ T20 లో భారత్ ఘోర ఓటమి పాలైంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్ తో జరిగిన మూడవ T20 లో భారత్ ఘోర ఓటమి పాలైంది. 76 పరుగులకే ఆల్ ఔటయ్యి భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది. టాస్ గెలిచిన టీంఇండియా బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ మొదట బ్యాటింగుకు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(70), శామ్ కరన్(40), బట్లర్(36) పరుగులతో రాణించారు. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆల్ ఔట్ కాగా.. ఏ ఒక్క బ్యాటర్ 20 రన్స్ కూడా చేయలేదు. అభిషేక్ శర్మ (10), వైభవ్ సూర్యవంశీ (13), ఇషాన్ కిషన్ (13), అక్షర్ పటేల్ (10), హర్షిత్ రాణా (9) శ్రేయస్ అయ్యర్ (5), వరుణ్ చక్రవర్తి (5), అర్ష్‌దీప్ సింగ్ (4), తిలక్ వర్మ (3), శివమ్ దూబె (2) పరుగులు చేశారు. వచ్చినవాళ్లను వచ్చినట్టే ఇంగ్లండ్ బౌలర్లు పెవిలియన్ కు పంపారు. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్ 4, ఆర్చర్ 3, రషీద్ 2, జాక్స్ ఒక వికెట్ తీశారు. ఐదు T20 మ్యాచుల సిరీస్ లో ఇంగ్లండ్ 2-0 తో లీడ్ లో ఉంది.
- Tags
- ENG vs IND
- T20






