- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) కి చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) కి చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాట్‌జీపీటీ ప్రాంప్ట్ సర్వీస్‌లతో పాటు ఇమేజ్ జనరేషన్ (DALL-Eతోపాటు ఇతర అనుబంధ సేవల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. చాట్‌జీపీటీ పనిచేయడం లేదంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు.
సంస్థ స్పందన ఇదే
ఈ గ్లోబల్ అవుటేజ్‌పై ఓపెన్‌ఏఐ సంస్థ వెంటనే స్పందించింది. తమ చాట్‌జీపీటీ సేవల్లో సాంకేతిక సమస్య ఏర్పడిన మాట వాస్తవమేనని, యూజర్ల నుంచి కూడా దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సమస్యను గుర్తించిన వెంటనే కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ బృందం రంగంలోకి దిగిందని, పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు తీసుకున్న తక్షణ చర్యల వల్ల ఇప్పటికే చాట్‌జీపీటీ సేవలు చాలా వరకు పునరుద్ధరించబడినట్లు ఓపెన్‌ఏఐ తాజా అప్‌డేట్‌లో తెలిపింది. అయితే ఇమేజ్ జనరేషన్ వంటి మరికొన్ని సేవల్లో ఇంకా అక్కడక్కడా అంతరాయం కొనసాగుతోందని, వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ యూజర్లకు స్పష్టం చేసింది.






