- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విపక్షాలకు రామ మందిర నిర్మాణం జీర్ణం కావట్లేదు : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం విపక్షాలకు జీర్ణం కావడం లేదని యూపీ సీఎం యోగి ఆదిథ్యనాథ్ ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామ మందిర్ విరాళాల చోరీ వివాదంపై వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారని, అయితే వక్ప్ భూముల విషయంలో మాత్రం మౌనంగా ఉంటారని ఆరోపించారు. అయోధ్యలో జరిగిన ఒక ఘటనపై వారు ప్రశ్నలు లేవనెత్తుతూ దాడి చేస్తున్నారని, అదే సమయంలో వక్ప్ అంశాలపై మాత్రం వారి నోళ్లకు ఫెవికాల్ ఎందుకు అంటుకుపోయిందని ప్రశ్నించారు. సమాజ్ వాదీ పార్టీ అక్కడ బాబ్రీ నిర్మాణం చూడాలని అనుకుందని, కానీ ఇప్పుడు అక్కడ ఒక భవ్యమైన రామ్ మందిరం నిర్మాణం కనిపించడం వారికి జీర్ణం కావడం లేదని ఆరోపించారు. ఎస్పీ, కాంగ్రెస్ రెండు కూడా ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నాయని విమర్శించారు. పేదలు, బలహీన వర్గాలకు కేటాయించాల్సిన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి విక్రయించారని, కానీ దీనిపై ప్రతిక్షాలు నోరు మెదపవని మండిపడ్డారు. హిందూ మతపరమైన స్థలాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను గత ప్రభుత్వాలు దుర్వినియోగం చేశాయని ఆరోపించారు.
విరాళాల అక్రమాలపై ట్రస్టే విచారణ కోరింది
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయాన్ని నడుపుతోందని, దాని పనిలో ఎవరి జోక్యం లేదని ఆయన చెప్పారు. విరాళాల జరిగిన అక్రమాలపై ట్రస్ట్ స్వయంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను కోరిందని తెలిపారు. సిట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని, ఇప్పటికే నిందితులపై చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు.






