ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. లేటెస్ట్ అప్డేట్‌తో ఫౌజీపై భారీ హైప్

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘ఫౌజీ’ ఒకటి.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. లేటెస్ట్ అప్డేట్‌తో ఫౌజీపై భారీ హైప్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘ఫౌజీ’ ఒకటి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈనెల 10 నుంచి హైద‌రాబాద్ శివార్లలోని 'ఆచార్య' సెట్‌లో ఇంట్రవెల్ ఎపిసోడ్‌ను షూట్ చేయబోతున్నారు. ముందు రిహార్సల్ చేసి.. అన్నీ ప‌క్కాగా కుదిరిన త‌ర‌వాత‌ షూట్ మొద‌ల‌వుతుందట. ఇది మామూలు యాక్షన్ సీక్వెన్స్ కాదని, మొత్తం సినిమాకే టర్నింగ్ పాయింట్‌గా నిలిచే ఘట్టమని ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టిగా టాక్ వినిపిస్తుంది.

అంతే కాకుండా.. రామ్ ల‌క్ష్మణ్ ఈ యాక్షన్ ఘ‌ట్టానికి నేతృత్వం వ‌హిస్తుండగా.. ఈ ఇంట్రవెల్ బ్యాంగ్‌, అందులో చూపించే ఎమోష‌న్‌, ఎలివేష‌న్‌ నెక్ట్స్ లెవర్‌లో ఉండబోతున్నాయని సమాచారం. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ గురించి ఎప్పటికీ మాట్లాడుకొంటూనే ఉంటారని కూడా ఫిలిమ్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తుండగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతూ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నాయి. కాగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story