- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదయాన్నే లవంగాలు తింటే ఇన్ని లాభాలా..?
ప్రతీ రోజు లవంగాలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ఉదయాన్నే ఒకటి లేదా రెండు లవంగాలు నమలడం వల్ల ఐదు సైన్స్ బేస్డ్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : ప్రతీ రోజు లవంగాలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ఉదయాన్నే ఒకటి లేదా రెండు లవంగాలు నమలడం వల్ల ఐదు సైన్స్ బేస్డ్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఉండే యూజెనాల్ అనే శక్తివంతమైన సమ్మేళనం కారణంగా ఈ ప్రయోజనాలు చేకూరుతాయని వివరిస్తున్నారు.
1. నోటి ఆరోగ్యం : లవంగాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పని చేస్తాయి. దంతాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతూ.. సహజమైన నొప్పి నివారకంగా పని చేస్తాయి. యూజెనాల్ లిడోకైన్ లాంటి ప్రభావాన్ని చూపుతుంది. ఇది దంతాలు, చిగుళ్ల సమస్యలు, బ్యాక్టీరియాను తగ్గించి ఊపిరి తాజాగా ఉంచుతుంది. ప్రతి ఉదయం నమలడం వల్ల నోటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
2. వాపు తగ్గుదల : లవంగాలు చాలా ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొని శరీరంలో వాపును తగ్గిస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల్లో సహాయపడుతుంది.
3. జీర్ణక్రియ మెరుగు : లవంగాలు జీర్ణ సమస్యలు, వాయువు, అజీర్ణం, మలబద్ధకం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడతాయి. ఉదయం నమలడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ : కొన్ని అధ్యయనాల ప్రకారం.. లవంగాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ నియంత్రణలో ఉపయోగకరం.
5. లివర్ ఆరోగ్యం : లవంగాల్లోని యూజెనాల్ సమ్మేళనం.. లివర్‌ను రక్షించడంలో సహాయపడుతుంది. లవంగాలు యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
గమనిక : ఈ కంటెంట్ ఇంటర్నెట్ నుంచి తీసుకోబడినది.






