వద్దు అని చెప్పిన నాన్న అలాంటి వీడియోస్ షేర్ చేస్తారు.. శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

మల్టీ స్టారర్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శృతి హాసన్.. రీసెంట్‌గా ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించింది.

వద్దు అని చెప్పిన నాన్న అలాంటి వీడియోస్ షేర్ చేస్తారు.. శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మల్టీ స్టారర్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శృతి హాసన్.. రీసెంట్‌గా ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. తన తండ్రితో తనకు ఉన్న రిలేషన్ గురించి తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చింది. ‘నాన్న నాతో చాలా సరదాగా ఉంటారు. ఆయన నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫన్సీ రీల్స్ పంపుతుంటారు. కొన్నిసార్లు అవి కాస్త విచిత్రంగా అనిపిస్తాయి.. అప్పుడు నేను ఆయనతో 'నాన్నా, ఈ ఆంటీ చేసేవి అంతగా నవ్వు తెప్పించేలా ఉండవు' అని చెబుతుంటాను. అలాగే కళాత్మకమైన వీడియోలను కూడా నాకు షేర్ చేస్తుంటారు. ఒక చిన్న పాప పాట పాడుతున్న వీడియోను పంపినప్పుడు, అది నన్ను గుర్తుచేసుకుని పంపారని నాకు అర్థమవుతుంది.. అలాంటివి చాలా ముచ్చటగా అనిపిస్తాయి. పల్లెటూళ్ళలో వంట చేసేవారి వీడియోలు, సంగీతకారులు, కళలకు సంబంధించిన విషయాలంటే ఆయనకు చాలా ఇష్టం. వాటిని నాతో కూడా షేర్ చేసుకుంటారు’ అని వారి మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది శృతి హాసన్.

Next Story