- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
by Ajay Maddhiboyina |
విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు తక్షణ సాయం ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు తక్షణ సాయం ప్రకటించింది. వెంటనే బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఇదిలా ఉంటే చేపలవేటకు వెళ్లిన మత్య్సకారులు తిరిగి వస్తున్న క్రమంలో శనివారం వారి బోటు గల్లంతైంది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 7గురు ఉండగా వారిలో ఒకరు బోటును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఆరుగురు సముద్రంలో గల్లంతవ్వగా ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. గల్లైంతైనవారి కోసం కోస్టుగార్డులు, స్థానికుల పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. గల్లైంతైనవారి కోసం సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
Next Story






