- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య టీ20..స్టేడియంలో ధోని ప్రత్యక్షం
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోన్న నేపథ్యంలో ధోని ప్రత్యక్షం అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య కాసేపటికి క్రితమే మూడవ టీ20 ప్రారంభమైంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచి, ఫస్ట్ బౌలింగ్ చేసేందుకు శ్రేయస్ అయ్యర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ పది ఓవర్లు ఆడి, 92 పరుగులు సాధించింది. ఇదే దూకుడు కొనసాగిస్తే 200 స్కోర్ దాటడం ఈజీ అని చెప్పవచ్చు.
మైదానంలో మెరిసిన మహేంద్ర సింగ్ ధోని
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడవ టీ20 జరుగుతున్న నేపథ్యంలో బర్త్ డే బాయ్ మహేంద్ర సింగ్ ధోని స్టేడియంలో మెరిశారు. ఇవాళ 45వ ఏటలో అడుగుపెట్టిన ఆయన, తన స్నేహితులతో కలిసి ఈ మ్యాచ్ తిలకిస్తున్నారు. కళ్ళజోడుతో పాటు, బ్లాక్ డ్రెస్ ధరించిన మహేంద్ర సింగ్ ధోని.. చాలా కూల్ గా నవ్వుతూ కనిపించారు. దీంతో మహేంద్రసింగ్ ధోని వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పుట్టినరోజున మహేంద్రుడి దర్శన భాగ్యం కలిగిందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.






