- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Triumph: మరోసారి ధరలు పెంచిన ట్రయంఫ్
ఇప్పుడు రెండోసారి కూడా అన్ని మోడళ్ల ధరలను కంపెనీ సవరించింది. తాజా పెంపు 1.22 శాతం నుంచి 5.03 శాతం వరకు ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ కంపెనీ ట్రయంఫ్ తన 350 సిరీస్ బైకుల ధరలను మరోసారి పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తక్కువ సామర్థ్యం గల ఇంజిన్‌తో ఈ సిరీస్‌లో బైకులను విడుదల చేసిన తర్వాత, జూన్‌లో ఒకసారి ధరలు పెంచింది. ఇప్పుడు రెండోసారి కూడా అన్ని మోడళ్ల ధరలను కంపెనీ సవరించింది. తాజా పెంపు 1.22 శాతం నుంచి 5.03 శాతం వరకు ఉంది. ఈ పెంపు తక్కువే అయినప్పటికీ, విడుదలైన మూడు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ధరలు పెరగడం కొనుగోలుదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ జీఎస్టీ (18 శాతం) ప్రయోజనంతో ఈ బైక్‌లను మరింత ఆకర్షణీయమైన ధరలో అందించాలని కంపెనీ భావించినప్పటికీ, వరుస ధరల పెంపుతో ఆ విలువ ప్రయోజనం కొంత తగ్గినట్లుగా కనిపిస్తోంది. ధరల పెంపులో స్పీడ్ టీ4పై అత్యధికంగా రూ. 10 వేలు పెరగడంతో దీని ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.09 లక్షలకు పెరిగింది. లాంచ్ ధరతో పోలిస్తే ఇప్పుడు ఇది రూ.14,000 ఎక్కువ. స్పీడ్ 400 ధర రూ.2.34 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు, స్క్రాంబ్లర్ 400ఎక్స్ రూ.2.59 లక్షల నుంచి రూ.2.65 లక్షలకు, థ్రక్స్టన్ 400 రూ.2.70 లక్షల నుంచి రూ.2.75 లక్షలకు, స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌సీ రూ.2.94 లక్షల నుంచి రూ.2.99 లక్షలకు పెరిగాయి. ట్రాకర్ 400పై మాత్రం తక్కువగా రూ.3,000 పెంచగా, ధర రూ.2.49 లక్షలకు చేరింది.






