ఉప్పల్ మెట్రో డిపోను సందర్శించిన హెచ్ఎంఆర్ఎల్ ఏఎండీ అజిత్ రెడ్డి

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ నెట్‌వర్క్ ఆపరేషన్లు, నిర్వహణ, భద్రతా వ్యవస్థలను సమీక్షించేందుకు మంగళవారం ఉప్పల్ మెట్రో డిపోను సందర్శించారు.

ఉప్పల్ మెట్రో డిపోను సందర్శించిన హెచ్ఎంఆర్ఎల్ ఏఎండీ అజిత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ నెట్‌వర్క్ ఆపరేషన్లు, నిర్వహణ, భద్రతా వ్యవస్థలను సమీక్షించేందుకు మంగళవారం ఉప్పల్ మెట్రో డిపోను సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా, ఆయన ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ), కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లను పరిశీలించారు. రియల్-టైమ్ రైలు కార్యకలాపాలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, భద్రతా నిఘా, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలు, మొత్తం నెట్‌వర్క్ నిర్వహణపై అధికారులు ఆయనకు వివరించారు.

హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులతో పాటు, కేవీబీ.రెడ్డి, ఇతర సీనియర్ ప్రతినిధులతో కూడిన ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్, కియోలిస్ బృందంతో అదనపు ఎండీ అజిత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్, కియోలిస్ అధికారులు మెట్రో రైలు కార్యకలాపాలు, ప్రయాణీకుల సేవలు, నిర్వహణ వ్యవస్థలు, కార్యాచరణ నియంత్రణ, భద్రతా నియమావళి, డిపో సౌకర్యాలు మరియు మెట్రో కార్యకలాపాల ఆర్థిక అంశాలను వివరిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు కార్యకలాపాలపై సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. అదనపు మేనేజింగ్ డైరెక్టర్ వివిధ కార్యాచరణ మరియు నిర్వహణ అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ పర్యటనలో భాగంగా బి. అజిత్ రెడ్డి రోలింగ్ స్టాక్, ఇతర కీలక మౌలిక సదుపాయాల కోసం అనుసరిస్తున్న నిర్వహణ పద్ధతులను తెలుసుకోడానికి మెయింటెనెన్స్ వర్క్‌షాప్, వీల్ లేత్ వర్క్‌షాప్ (వీల్ గ్యారేజ్)ను పరిశీలించారు. మెట్రో రైల్ నిర్వహణ నిపుణులు, అధికారులు అవలంబిస్తున్న నిర్వహణ ప్రమాణాలను, కార్యాచరణ సామర్థ్యాన్ని ఆయన అభినందించారు. ఈ పర్యటనలో హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డీవీఎస్.రాజు; చీఫ్ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ఎస్కే. దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్, చీఫ్ ఇంజనీర్ సాయప రెడ్డి, జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ) శ్రీనాథ్ రెడ్డి, తదితర హెచ్‌ఎంఆర్‌ఎల్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Next Story