- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా ATMలలో క్యాష్ కొరత.. డైరెక్ట్‌గా రంగంలోకి దిగిన ఆర్‌బీఐ
దేశవ్యాప్తంగా పలు ఏటీఎంలలో నగదు కొరత నివేదికలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రియాక్ట్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏటీఎమ్ (ATM)లలో నగదు కొరత ఉందనే గ్రౌండ్ రిపోర్టుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే స్పందించింది. ఈ మేరకు ప్రజలు నగదు విత్‌డ్రా చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అయితే, గత వారం రోజులుగా పలు ప్రధాన నగరాలతో పాటు టౌన్లలో ఏటీఎమ్‌లు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని. ఎక్కడ చూసినా ‘నో క్యాష్’ బోర్డులే ఉన్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్బీఐ నేరుగా యాక్షన్‌లోకి దిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యాంకులలో, ఏటీఎమ్‌లలో తగినంత నగదు నిల్వలు ఉండేలా చూసేందుకు, ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా నగదు సరఫరా జరుగుతుందో లేదో ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు, బ్యాంకుల ఏటీఎమ్‌లలో మాత్రమే తాత్కాలికంగా ఈ సమస్య తలెత్తిందా, దీని వెనుక టెక్నికల్, ట్రాన్స్‌పోర్టేషన్ సమస్యలు ఏమైనా అన్ని కోణంలో ఆర్‌బీఐ అధికారులు సమీక్ష చేపడుతున్నారుజ
బ్యాంకులకు కీలక ఆదేశాలు..
కాగా, ఏటీఎమ్‌లలో నగదు లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏటీఎమ్‌లు ఎక్కువ సమయం పాటు ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని ఆర్‌బీఐ వర్గాలు ఆయా ప్రముఖ బ్యాంకులకు సూచించినట్లుగా తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలు పెరిగినా.. చాలామంది తన రోజువారీ అవసరాల కోసం ఏటీఎమ్‌లపైనే ఆధారపడుతుండటంతో, నగదు కొరతను ఆర్‌బీఐ త్వరలోనే పరిష్కరించనున్నట్లుగా సమాచారం.






