దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన దుప్పి..

by Batti.Sumithra |

అభయారణ్యం నుంచి దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన ఓ దుప్పి వీధికుక్కల దాడిలో గాయపడగా, అప్రమత్తమైన స్థానికులు దానిని కాపాడి పోలీసులకు అప్పగించిన ఘటన నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.

దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన దుప్పి..
X

దిశ, నాగిరెడ్డిపేట్: అభయారణ్యం నుంచి దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన ఓ దుప్పి వీధికుక్కల దాడిలో గాయపడగా, అప్రమత్తమైన స్థానికులు దానిని కాపాడి పోలీసులకు అప్పగించిన ఘటన నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం అటవీ ప్రాంతం నుంచి సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో గోపాల్‌పేట్ గ్రామ శివారులోకి దారి తప్పి వచ్చిన దుప్పిని వీధికుక్కలు వెంటాడాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుప్పిని కుక్కల బారి నుంచి రక్షించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని దుప్పిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాగిరెడ్డిపేట్ రేంజ్ పరిధిలోని ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో దుప్పిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు మండల అటవీ శాఖ అధికారి వాసుదేవ్‌రావు, డీఆర్‌వో రాఘవేందర్ తెలిపారు.

Next Story