- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు.. పలు జిల్లాల్లో నిందితులపై కేసులు నమోదు
రాష్ట్రంలో నాటుసారా ఐడీ లిక్కర్ తయారీ, విక్రయాలు, రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ సారా స్థావరాలను నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నాటుసారా ఐడీ లిక్కర్ తయారీ, విక్రయాలు, రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ సారా స్థావరాలను నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ముందుగానే గుర్తించిన ఐడీ స్పాట్స్ పై ఎక్సైజ్ ప్రత్యేక బృందాలు, స్థానిక స్టేషన్ల సిబ్బంది ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నారు. వరంగల్‌లో భారీ ఆపరేషన్ ఈ దాడుల్లో భాగంగా వరంగల్ రూరల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో అధికారులు భారీ నిల్వలను ధ్వంసం చేశారు. 53 లీటర్ల నాటుసారాతో పాటు, సారా తయారీ కోసం సిద్ధం చేసిన సుమారు 1250 లీటర్ల బెల్లాం పానకాన్ని గుర్తించి అక్కడికక్కడే నేలపాలు చేశారు. సారా బట్టీలను ధ్వంసం చేసి తయారీదారులకు హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 71 లీటర్ల నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల లక్షెట్టిపేట, చెన్నూర్ ప్రాంతాల్లో దాడులు జరిపి 16 లీటర్ల సారాను పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 13.5 లీటర్ల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. జనగామ పాలకుర్తి మండలంలో 3.5 లీటర్ల సారా దొరికింది.నాగర్ కర్నూల్ కొల్లాపూర్ ప్రాంతంలో 5 లీటర్ల ఐడీ లిక్కర్‌ను సీజ్ చేశారు. సిద్దిపేట తనిఖీల్లో 6 లీటర్ల నాటుసారా పట్టుబడింది.ఈ అక్రమ దందాలకు పాల్పడుతున్న పలువురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.






