- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామలో హిట్ అండ్ రన్ బీభత్సం.. ఇద్దరి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఈరోజు(మంగళవారం) రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

దిశ,పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఈరోజు(మంగళవారం) రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇన్నోవా కారు(TG08AR1911)తో నిర్లక్ష్యంగా వెళ్తున్న డ్రైవర్ వరుసగా ఇద్దరిని ఢీ కొట్టడంతో వారు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గూడూరు గ్రామానికి చెందిన చీపురు రాహుల్ ఇన్నోవా కారును వేగంగా నడుపుతూ పాలకుర్తిలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెల్ది గ్రామానికి చెందిన పెంటాల వెంకటలక్ష్మి(50) అక్కడికక్కడే మృతి చెందగా, పెద్దల శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అదే కారుతో పరారవుతున్న నిందితుడు గూడూరు గ్రామ సమీపంలో కృష్ణాజిగూడెంకు చెందిన వడ్లకొండ రంజిత్‌ను ఢీకొట్టడంతో ఆయన కూడా మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితుడు ఇన్నోవా కారును అక్కడే వదిలేసి పరారైనట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు కారు స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






