- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికిత్స పొందుతూ మాజీ కో ఆప్షన్ సభ్యుడు మృతి..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తల్లాడ మండల మాజీ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ అలీబాబా (80) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.

దిశ, తల్లాడ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తల్లాడ మండల మాజీ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ అలీబాబా (80) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన షేక్ అలీబాబా గత నెల 26వ తేదీ రాత్రి తల్లాడ నుంచి స్వగ్రామమైన బిల్లుపాడుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. షేక్ అలీబాబా 2001 నుంచి 2006 వరకు తల్లాడ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా సేవలందించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేసి, భౌతికకాయానికి నివాళులర్పించారు.






