వలస కార్మికుల పిల్లలకూ అంగన్వాడీ సేవలు

by velandi.Saikiran |

చిన్నారులే దేశ సంపదని, ఏ ఒక్క చిన్నారి కూడా అంగన్వాడీ సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం 'మొబైల్ అంగన్వాడీ' కేంద్రాలను అందుబాటులోకి తెస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

వలస కార్మికుల పిల్లలకూ అంగన్వాడీ సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : చిన్నారులే దేశ సంపదని, ఏ ఒక్క చిన్నారి కూడా అంగన్వాడీ సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం 'మొబైల్ అంగన్వాడీ' కేంద్రాలను అందుబాటులోకి తెస్తోందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి ఆమె మంగళవారం ఈ మొబైల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ వంటి నగరాలకు ఉపాధి కోసం వలస వచ్చే కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందడం లేదని, వారి కోసమే ఈ ప్రత్యేక వాహనాలను రూపొందించామని మంత్రి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీ నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

దీంట్లో సాధారణ అంగన్వాడీ కేంద్రాల్లో అందే పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, ప్రీ-స్కూల్ విద్య, తల్లీబిడ్డల సంక్షేమ సేవలు అన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఒక్కో మొబైల్ వాహనం దాదాపు 10 అంగన్వాడీ కేంద్రాలకు సమానంగా సేవలు అందిస్తుందని సీతక్క వివరించారు. వీటీ ద్వారా సుమారు 300 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రజలు ఉన్న చోటుకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఆరోగ్యవంతమైన భావితరాన్ని నిర్మించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి, మేడ్చల్ మల్కాజ్‌గిరి డిడబ్ల్యూవో శారద తదితరులు పాల్గొన్నారు.

Next Story