- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EPFO: ఈపీఎఫ్ఓతో చేతులు కలిపిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
దీంతో పీఎఫ్ చెల్లింపుల ప్రక్రియ మరింత వేగవంతం, సురక్షితం, సౌకర్యవంతంగా మారుతుందని బ్యాంక్ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈపీఎఫ్ఓతో అనుసంధానం అవుతూ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లింపుల సేవలను మంగళవారం ప్రారంభించింది. ఈ సదుపాయంతో సంస్థలు ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచే నేరుగా పీఎఫ్ చెల్లింపులను ప్రారంభించి, వాటిని బ్యాంకు రిటైల్ లేదా కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. దీంతో పీఎఫ్ చెల్లింపుల ప్రక్రియ మరింత వేగవంతం, సురక్షితం, సౌకర్యవంతంగా మారుతుందని బ్యాంక్ తెలిపింది. ఈ డిజిటల్ లింకేజ్ వల్ల వ్యాపార సంస్థలు ఎలాంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా సురక్షితంగా, క్షణాల వ్యవధిలో పీఎఫ్ బకాయిలను జమ చేయవచ్చని బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్ హెడ్ ఆశిష్ సింగ్ వెల్లడించారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించే దిశగా ఈ అనుసంధానం కీలక అడుగు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కస్టమర్లకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించడమే బ్యాంకు లక్ష్యమన్నారు. ఈపీఎఫ్‌ఓతో భాగస్వామ్యం ద్వారా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోనుంది. ఇటీవలే మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాంక్ దాదాపు 3.8 కోట్ల మంది కస్టమర్లతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. ఈ బలమైన ఆర్థిక పునాదితో, ఇప్పుడు పీఎఫ్ చెల్లింపుల వంటి ప్రభుత్వ రంగ డిజిటల్ సేవలను కూడా తమ ఖాతాదారులకు సులభంగా అందించేందుకు బ్యాంక్ వేగంగా అడుగులు వేస్తోంది.






