ప్రేమించి కాపురం చేసి ఇప్పుడు వద్దంటున్నాడు.. పాస్టర్ పై మహిళ ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని, ఆరేళ్లు కాపురం చేసిన తరవాత తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఓ మహిళ చర్చి పాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అమలాపురంలో చోటు చేసుకుంది.

ప్రేమించి కాపురం చేసి ఇప్పుడు వద్దంటున్నాడు.. పాస్టర్ పై మహిళ ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని, ఆరేళ్లు కాపురం చేసిన తరవాత తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఓ మహిళ చర్చి పాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అమలాపురంలో చోటు చేసుకుంది. అమలాపురానికి చెందిన చర్చి పాస్టర్ సురేష్ బాబు తనను మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 నుండి తనకు పాస్టర్ తో పరిచయం ఉందని తెలిపింది. పాస్టర్ తో పెళ్లి జరగకముందే తనకు వేరే వ్యక్తితో పెళ్లై పిల్లలు ఉన్నారని చెప్పింది. అయినప్పటికీ నీకు తోడు ఉంటాను అంటూ నమ్మించి వాళ్ల కుటుంబానికి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని తెలిపింది.

ఆ తరవాత వాళ్ల వదినకు విషయం తెలిసి తనకు ఫోన్లు చేసి వేధించడం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పెళ్లి జరిగిన విషయం పాస్టర్ తల్లి, అక్కకు కూడా తెలిసిందని, వాళ్లు కూడా తనతో మాట్లాడారని చెప్పింది. వాళ్ల వదిన మాత్రమే తనను వ్యతిరేకిస్తుందని బాధితురాలు ఆరోపించింది. అతడితో ఆమెకు ఎఫైర్ ఉందని చెబుతోంది. తనకు న్యాయం చేయాలని తన భర్త తనకు కావాలని చెప్పింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే కుటుంబాన్ని వదిలేసి వస్తానని చెప్పాడని ఇప్పుడు ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులే తనకు న్యాయం చేయాలని కోరింది.

Next Story