పాత వాహనదారులకు బిగ్ అలర్ట్.. ‘20 పెట్రోల్’పై ARAI సంచలన నివేదిక

by Kema Shiva Kumar |

ఈ-20 పెట్రోల్ వినియోగంపై ‘ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఇచ్చిన పాత వాహనదారుల్లో గుబులు పుట్టిస్తోంది.

పాత వాహనదారులకు బిగ్ అలర్ట్.. ‘20 పెట్రోల్’పై ARAI సంచలన నివేదిక
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రస్తుతం వాడుకలోకి వచ్చిన 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) వల్ల పాత వాహనాల ఇంజన్లలోని కొన్ని విడిభాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ‘ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ARAI) జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ-20 ఇంధనం వల్ల పాత వాహనాలలోని రబ్బర్ భాగాలు, గ్యాస్కెట్లు కాలక్రమేణా క్షీణించే (Deterioration) అవకాశం ఉందని నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త వాహనాలను ఈ-20 ఇంధనానికి అనుకూలంగా తయారు చేస్తున్నప్పటికీ, అంతకు ముందు E10 పెట్రోల్‌తో నడిచే పాత కార్లు, బైక్‌ల విషయంలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధ్యయనంలో దిమ్మతిరిగే నిజాలు..

ఇథనాల్‌కు ఉండే సహజ రసాయనిక గుణాల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలో (Fuel System) ఉండే రబ్బర్ గొట్టాలు (Hoses), సీల్స్, గ్యాస్కెట్లు, ప్లాస్టిక్ భాగాలు త్వరగా అరిగిపోయి.. ఉబ్బి దెబ్బతింటాయని ARAI తన నివేదికలో తెలిపింది. అయితే, ఇంజన్‌లోని మెటల్ భాగాలకు ఈ20 పెట్రోల్‌తో ఎలాంటి ముప్పు లేదని, తుప్పు పట్టే సమస్యలు మాత్రం ఉండవని తేలింది.

లీకేజీల సమస్య..

అయితే, ఫ్యూయెల్ పైపులలోని రబ్బర్ భాగాలు దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో వాహనాల్లో పెట్రోల్, డీజిల్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని, దీంతో ఇంజన్ పనితీరు కూడా పడిపోతుందని ARAI రిపోర్టులో తేలింది. ఈ క్రమంలోనే పాత వాహనాలు ఉన్న వారు ఫ్యూయల్ సిస్టమ్‌లోని పాత రబ్బర్ పైపులు, గ్యాస్కెట్లను ఇథనాల్‌ను తట్టుకోగల ఆధునిక విడిభాగాలతో రీప్లేస్ చేసుకోవాలని ఆటోమొబైల్ టెక్నీషియన్లు సూచిస్తున్నారు. లేనిపక్షంలో వాహనాలు చూస్తుండగానే షెడ్డుకు వెళ్లడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Next Story