ఫెర్టిలైజర్ షాప్ యజమానులకు షోకాజ్ నోటీసులు

by Jakkula.Mamatha |

మహాదేవపూర్ మండలంలోని సూరారం మరియు రాపల్లికోటలో గల ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు.

ఫెర్టిలైజర్ షాప్ యజమానులకు షోకాజ్ నోటీసులు
X

దిశ, మహదేవపూర్: మహాదేవపూర్ మండలంలోని సూరారం మరియు రాపల్లికోటలో గల ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యూరియాను అధిక ధరలకు అమ్ముతూ, స్టాక్ రిజిస్టర్స్ మరియు బిల్ బుక్స్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయకుండా, రైతులకు బిల్లులు ఇవ్వడం లేదని అన్నారు. సూరారంలోని సాయి ఫర్టిలైజర్స్ రూ.2,39,000 విలువ చేసే సరుకుకు మరియు DCMS రాపల్లికోట షాప్ సుమారు రూ.1,47,000 విలువ చేసే సరుకులకు స్టాఫ్ సేల్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎలాంటి క్రయవిక్రయాలు జరపకూడదని తెలిపి, సంజాయిషీ కోరుతూ షో కాజ్ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా మరో ఎరువుల దుకాణంలో కూడా తనిఖీ చేసి లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ పాల్, మండల వ్యవసాయ అధికారిని శ్రీజ, వ్యవసాయ విస్తరణ అధికారులు రచన, ధర్మేందర్ ఉన్నారు.

Next Story