- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేయాలి: సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి
by Taduka Kalyani |
జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.

X
దిశ, కొండపాక: జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కొండపాక మండలం విశ్వనాథ్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆక్రమణల పూర్తి సమాచారాన్ని సేకరించాలన్నారు. ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజా సంక్షేమ భవనాల నిర్మాణాలకు స్థలాల కొరత ఉందని, అందుకే ప్రభుత్వ భూములను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story






