- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి గుంతలో పడి మధ్యప్రదేశ్ కార్మికుడి మృతి
మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో నర్సరీ సమీపంలోని నీటి గుంతలో పడి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

దిశ,వంగూరు: మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో నర్సరీ సమీపంలోని నీటి గుంతలో పడి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాధ్వని జిల్లా, సెంధ్వ ప్రాంతానికి చెందిన ఘోకారియా(48) వంగూరు గేటు వద్ద ఉన్న ఎస్‌వీఎస్ కాటన్ మిల్లులో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. గత శనివారం(జూలై 4) ఉదయం మిల్లు నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, సహచరులు గాలించినా ఆచూకీ లభించలేదు. తుమ్మలపల్లి నర్సరీ సమీపంలోని నీటి గుంటలో మృతదేహం కనిపించగా, అక్కడికి పశువులు మేపేందుకు వెళ్లిన కాపరి ఇదమయ్య గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న ఎస్సై మాధవరెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మామ రవి హరిదాస్ దుదువే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనతో ఎస్‌వీఎస్ కాటన్ మిల్లు కార్మికులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.






