‘బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే’.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పై తీర్మానం చేసి సీబీఐ విచారణకు పంపిన అంశంపై విచారణ జరిపించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

‘బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే’.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,ధర్మారం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పై తీర్మానం చేసి సీబీఐ విచారణకు పంపిన అంశంపై విచారణ జరిపించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. బంజారాల సీత్లా పండుగ సందర్భంగా మంగళవారం ధర్మారం మండలం లంబాడి తండాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పై బీజేపీ నాయకులు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణ కొరకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటివరకు విచారణ ముందుకు సాగడం లేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం పై సీబీఐ విచారణ కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని భావిస్తామని లేదంటే రెండు పార్టీలు ఒకటేనని ప్రజలకు వివరిస్తామని మంత్రి తెలిపారు.

Next Story