కాపుగల్లు శివారులో 50 బస్తాల నల్ల బెల్లం స్వాధీనం

by Batti.Sumithra |

సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల నల్ల బెల్లాన్ని కోదాడ రూరల్ పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

కాపుగల్లు శివారులో 50 బస్తాల నల్ల బెల్లం స్వాధీనం
X

దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల నల్ల బెల్లాన్ని కోదాడ రూరల్ పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు ప్రాంతం నుంచి కర్ణాటక వైపు టాటా ఏస్ వాహనంలో భారీ మొత్తంలో నల్ల బెల్లాన్ని తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో కోదాడ రూరల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కాపుగల్లు గ్రామ శివారులో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా, అందులో 50 బస్తాల నల్ల బెల్లం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహనంతో పాటు అందులోని సరుకును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్ ఎండ్రపల్లి ప్రభాకర్ రావు, వాహన యజమాని మాలోత్ సీతారాములు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు. నల్ల బెల్లం తరలింపునకు సంబంధించిన పూర్తి వివరాలు, సరుకును ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఏ ఉద్దేశంతో తరలిస్తున్నారు, చట్టపరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాల పై పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా సరుకులు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story