‘దోస్త్’ ఇంట్రా కాలేజ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..

by Kema Shiva Kumar |

‘దోస్త్’ (DOST) ఇంట్రా కాలేజ్ ఫేజ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

‘దోస్త్’ ఇంట్రా కాలేజ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ కాలేజీల్లో చేరిన విద్యార్థులు తమ కోర్సులను మార్చుకునేందుకు వీలుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) దోస్త్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.బాలకిస్టా‌రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ ఏ.శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఇంట్రా కాలేజ్ ఫేజ్ షెడ్యూల్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్ల జులై 10 నుంచి 13 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్ కల్పించారు. జులై 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. సంబంధిత కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటేనే, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఇంట్రా కాలేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఒకవేళ ఇంట్రా-కాలేజ్ ఫేజ్‌లో కొత్తగా సీటు అలాట్ కాకపోతే, విద్యార్థికి గతంలో వచ్చిన పాత సీటు అలాగే ఉంటుంది.

Next Story