- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రఘునాథ్ రప్పిన్ సంస్థలో భారీ పెట్టుబడులు
రఘునాథ్ రప్పిన్ స్థాపించిన కార్వ్ ఐటీ కన్సల్టెన్సీ ఎఫ్‌జెడ్-ఎల్‌ఎల్‌సీ సంస్థకు 4 మిలియన్ అమెరికన్ డాలర్ల అంతర్జాతీయ పెట్టుబడి కమిట్‌మెంట్ లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ రప్పిన్ స్థాపించిన కార్వ్ ఐటీ కన్సల్టెన్సీ ఎఫ్‌జెడ్-ఎల్‌ఎల్‌సీ సంస్థకు 4 మిలియన్ అమెరికన్ డాలర్ల అంతర్జాతీయ పెట్టుబడి కమిట్‌మెంట్ లభించింది. ఈ విషయాన్ని దుబాయ్‌లో నిర్వహించిన ఐసీఐఈ డీల్ రూమ్ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు. రాకెజ్ (రాస్ అల్ ఖైమా ఎకనామిక్ జోన్)లో స్థాపించిన కార్వ్ సంస్థ ఆరోగ్య సాంకేతిక రంగంలో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నది. దాదాపు రెండేళ్లుగా తన ఆలోచనను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన రఘునాథ్ రప్పిన్ వ్యాపార ప్రయాణంలో సందీప్ మక్తల మార్గదర్శకత్వం కీలక మలుపు తీసుకొచ్చింది. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ అంతర్జాతీయ వ్యాపార పర్యటనల్లో భాగంగా రఘునాథ్ సింగపూర్, అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించి, తన ఆలోచనను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసే అవకాశం పొందారు.
సందీప్ మక్తల వ్యాపార ప్రణాళికను మెరుగుపరచడం, పెట్టుబడిదారుల ముందుకు ధైర్యంగా వెళ్లేలా సన్నద్ధం చేయడం, వ్యాపార ప్రతిపాదనను మరింత బలంగా తీర్చిదిద్దడం, ప్రపంచ స్థాయి పరిచయాలు కల్పించడం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారు. కేవలం 30 రోజుల వ్యవధిలోనే రఘునాథ్ రప్పిన్ తన సంస్థకు 4 మిలియన్ అమెరికన్ డాలర్ల అంతర్జాతీయ పెట్టుబడి కమిట్‌మెంట్ సాధించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా రఘునాథ్ రప్పిన్ మాట్లాడుతూ రెండేళ్లుగా ఎన్నో తలుపులు తట్టానని.. ఎన్నో ప్రయత్నాలు చేశానని.. సందీప్ మక్తలను కలిసిన తర్వాత తన ప్రయాణం పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేశారు. ఐసీఐఈ చైర్మన్ సందీప్ మక్తల మాట్లాడుతూ మన యువ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమానికి రాకెజ్ ప్రతినిధులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఎమిరాతీ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణ రంగ ప్రముఖులు హాజరయ్యారు.






