రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు : ఎస్‌ఐ మధు

by Batti.Sumithra |

రోడ్లను ఆక్రమించి ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అర్వపల్లి ఎస్‌ఐ మధు హెచ్చరించారు.

రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు : ఎస్‌ఐ మధు
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : రోడ్లను ఆక్రమించి ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అర్వపల్లి ఎస్‌ఐ మధు హెచ్చరించారు. మంగళవారం అర్వపల్లి వై జంక్షన్ నాలుగు వైపులా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న రహదారి పై ఉన్న ఆక్రమణలను, రోడ్డుకు అడ్డంగా ఉంచిన వస్తువులను, అక్రమంగా నిలిపిన వాహనాలను సిబ్బందితో కలిసి తొలగించారు. అనంతరం పండ్లు, పూల వ్యాపారులు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులు, ఇతర వ్యాపారులకు రహదారిని ఆక్రమించకుండా వ్యాపారాలు నిర్వహించాలని, రోడ్డుపై వాహనాలు నిలిపివేయకుండా చూడాలని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎవరైనా రహదారిని ఆక్రమించడం, రోడ్డుకు అడ్డంగా వస్తువులు ఉంచడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మధు స్పష్టం చేశారు.

Next Story