- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢీకొన్న రెండు బైకులు.. ఒకరు మృతి
by Taduka Kalyani |
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేర్యాల మండలం కడవేరుగు గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

X
దిశ, చేర్యాల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేర్యాల మండలం కడవేరుగు గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. చేర్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపాక మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన తలపాక కిష్టయ్య (45) తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై నాగపురి గ్రామానికి వెళ్తున్న క్రమంలో కడవేరుగు గ్రామ శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో అదే మార్గంలో వెనుక నుంచి బైక్ వస్తున్న కడవేరుగు గ్రామానికి చెందిన గదరాజు కమలాకర్ వెనకనుంచి బలంగా ఢీకొట్టడంతో కిష్టయ్య కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన కిష్టయ్యను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






