‘రాకా’ షూటింగ్‌కు డెడ్‌లైన్.. మూవీ టీమ్‌కు అల్లు అర్జున్ టార్గెట్

by Chukka Sudharani |

‘పుష్ప, పుష్ప 2’ బ్లాక్ బస్టర్స్ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’.

‘రాకా’ షూటింగ్‌కు డెడ్‌లైన్.. మూవీ టీమ్‌కు అల్లు అర్జున్ టార్గెట్
X

దిశ, సినిమా: ‘పుష్ప, పుష్ప 2’ బ్లాక్ బస్టర్స్ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ అండ్ ముంబైలో భారీ సెట్స్ పై చిత్రీకరణ జరుపుకుంటుంది. అట్లీ తన సిగ్నేచర్ స్టైల్ యాక్షన్, ఎమోషన్‌తో బన్నీని పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. అల్లు అర్జున్ చేతిలో అట్లీ ‘రాకా’తో పాటు.. లోకేష్ కనగరాజ్ ‘AA22xLK’ ప్రాజెక్టు కుంది. అయితే.. డిసెంబర్ తర్వాత బన్నీ వెంటనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘AA22xLK’ సినిమా షూట్‌లో జాయిన్ అవుతారని సమాచారం. 2027 లోనే రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుండగా.. ‘రాకా’ షూటింగ్‌ని ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని బన్నీ టీమ్‌కి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు డెడ్ లైన్ ఫిక్స్ కావడంతో షూటింగ్ స్పీడ్ పెంచారని ప్రస్తుతం పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Next Story