- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వారణాసి’ నుంచి టీజర్ వచ్చేస్తోంది..ఎప్పుడంటే ?
‘వారణాసి’ నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: జక్కన్న, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో వారణాసి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరువనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్న ఈ మూవీ దాదాపు రూ.1400 కోట్లతో తెరకెక్కుతున్నట్లు టాక్.
2027 ఏప్రిల్ ఏడవ తేదీన ఉగాది కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్ అప్డేట్ వైరల్ గా మారింది. ఆగస్టు 9వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చేలా ఓ టీజర్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో మహేష్ బాబు రాముడి అవతారంలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ టీజర్ విడుదల చేసి.. హైప్ పెంచేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట.






