VIRAL: వయనాడ్‌లో ల్యాండ్‌స్లైడ్స్ బీభత్సం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

by Kema Shiva Kumar |

కేరళలోని వాయనాడ్‌లో ఘోర కొండచరియలు విరిగిపడిన భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

VIRAL: వయనాడ్‌లో ల్యాండ్‌స్లైడ్స్ బీభత్సం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే అందుకు సంబంధించిన భయంకరమైన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రమాదం జరగడానికి కేవలం కొన్ని సెకన్ల ముందు.. ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ (Fuel Tanker) రోడ్డుపై వెళ్తుండగా, ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు, బురద ప్రవాహం లారీని సైతం కొట్టుకుపోయేలా చేసిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం స్థానిక యంత్రాంగం, రెస్క్యూ టీమ్స్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

సీసీటీవీ దృశ్యాలు నెట్టింట్లో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లో రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్న సమయంలో, కొండపై నుంచి భారీ ఎత్తున మట్టి, బండరాళ్లు, వరద ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చాయి. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న అయిల్ ట్యాంకర్ ఆ బురద ప్రవాహానికి చిక్కి, క్షణాల వ్యవధిలోనే కొట్టుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతన్నాయి.

Next Story