బీసీసీఐపై విమ‌ర్శ‌లు చేస్తున్న‌ట్లు వీడియోలు..క్లారిటీ ఇచ్చిన సూర్య

by velandi.Saikiran |

బీసీసీఐ పెద్దలు, కోచింగ్ బృందాన్ని సూర్యకుమార్ విమర్శించినట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బీసీసీఐపై విమ‌ర్శ‌లు చేస్తున్న‌ట్లు వీడియోలు..క్లారిటీ ఇచ్చిన సూర్య
X

దిశ‌, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 తీసుకువచ్చిన సూర్యకుమార్ యాదవ్ ను భారత జట్టు నుంచి బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ, గంభీర్, అజిత్ అగార్కర్ లాంటి వాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ ను ఎలా తప్పిస్తారని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ నిలదీశారు. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు, కోచింగ్ బృందాన్ని సూర్యకుమార్ విమర్శించినట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా సూర్య కుమార్ యాదవ్ స్పందించారు.

తనను కెప్టెన్సీ నుంచి తొలగించినందుకు గాను ఎవరిని విమర్శించలేదని, కొంతమంది తప్పుడు వీడియోలు పెట్టి తనను బ్లేమ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనకు బీసీసీఐ అంటే ఎంతో గౌరవం అన్నారు. తాను జ‌ట్టులో లేకపోయినా భారత్ గెలవాలని నిత్యం ప్రార్థిస్తానని వెల్లడించారు. భారత జట్టు యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకున్నా, తాను స్వాగతిస్తానని స్పష్టం చేశారు. తనకు ఎవరు శత్రువులు లేరని.. కెప్టెన్సీ పోయిందన్న బాధ లేదని క్లారిటీ ఇచ్చారు. ఫేక్ వీడియోలను ఎవరు నమ్మకూడదని కోరారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ కామెంట్స్ తో వివాదానికి చెక్ ప‌డిన‌ట్ల‌యింది.

Next Story