గుండెపోటుతో మంథని సింగిల్ విండో సీఈవో అశోక్ మృతి

by Jakkula.Mamatha |

మంథని సింగిల్ విండో సీఈవో మామిడాల అశోక్ కుమార్(48) గుండెపోటుతో మృతి చెందారు.

గుండెపోటుతో మంథని సింగిల్ విండో సీఈవో అశోక్ మృతి
X

దిశ, మంథని: మంథని సింగిల్ విండో సీఈవో మామిడాల అశోక్ కుమార్(48) గుండెపోటుతో మృతి చెందారు. ఈ రోజు(మంగళవారం) మధ్యాహ్నం సమయంలో సీఈఓ అశోక్ రోజు వారీగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. గమనించిన తోటి సిబ్బంది మంథనిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కొరకు హుటాహుటిన కరీంనగర్ తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో సిఈఓ కార్యాలయంలో పని చేసే తన తోటి సిబ్బంది, బంధువు మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మృతి చెందడం పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సహచరులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.

Next Story