- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్స్యకారుల కోసం సెర్చ్ ఆపరేషన్ పొడిగింపు
విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ పొడిగించారు. మత్స్యకార కుటుంబాల విజ్ఞప్తితో ఆపరేషన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు జరగనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ పొడిగించారు. మత్స్యకార కుటుంబాల విజ్ఞప్తితో ఆపరేషన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు జరగనున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన వెంటనే బాడీస్ ట్రేస్ వివరాలపై మెయిల్ పంపనున్నారు. మెయిల్ ఆధారంగానే మస్సింగ్ కేసులకు సంబంధించి త్రిమెన్కమిటీ సర్టిఫికెట్ సేకరించనున్నారు. ఇదిలా ఉంటే శనివారం చేపలవేటకు వెళ్లి వస్తున్న సమయంలో బోటు గల్లంతు అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఏడుగురు ఉండగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఆరుగురు మత్స్యకారుల కోసం ఇప్పటికే 72 గంటల పాటు నేవీ, కోస్ట్ గార్డ్, నేవీ గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ గల్లంతైనవారి ఆచూకీ లభించలేదు. అయితే తమవారి ఆచూకీ కనుగొనాలని బాధితుల కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.






