బాచుపల్లిలో బైక్ దొంగ అరెస్ట్.. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

by Jakkula.Mamatha |

బాచుపల్లిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బాచుపల్లిలో బైక్ దొంగ అరెస్ట్.. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
X

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్తున్న నిందితుడిని చాక చక్యంగా పోలీసులు పట్టుకుని మంగళవారం జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానాస్పదంగా వెళ్తున్న నిందితుడు లేట్ల ప్రవీణ్(25)ను అదుపులోకి తీసుకుని విచారించగా, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు ద్విచక్ర వాహనాలు చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి వద్ద నుంచి యమహా ఆర్‌ఎక్స్ 135 మోటార్ సైకిళ్లు రెండు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అలాగే నిందితుడిపై గతంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో మరియు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story