- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థకు రూ.17 కోట్లు విడుదల
by velandi.Saikiran |
తెలంగాణ గీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల నుంచి రెండో త్రైమాసిక ఖర్చుల నిమిత్తం రూ.17 కోట్లు మంజూరు చేస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.బాల మాయాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ నిధులకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌తో పాటు గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.
Next Story






